![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -127 లో.. పూజకి టైమ్ అవుతుంది. వచ్చిన వారితో పూజలో కూర్చొమని పంతులు గారు చెప్తారు. ఎవరు రాలేదని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఎవరు రాకపోవడం ఏంటని అప్పుడే వచ్చిన సుజాత అడుగుతుంది. పిలిచావ్ కదా రాకపోవడం ఏంటని శ్రీలత అంటుంది. వాళ్లతో కలిసి పూజ చేస్తేనే వ్రతం ఫలితం ఉంటుందని పంతులు అంటారు. సరే అయితే ఇంకెప్పుడు అయిన చేసుకుందువని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీరు ఇప్పుడు పూజ చెయ్యలేదని బాధపడకండి అని సీతాకాంత్ తో శ్రీలత అంటుంది. పంతులు గారు మీరు వెళ్ళండని శ్రీలత చెప్తుంది.
ఆ తర్వాత రామలక్ష్మి అంటూ అయిదుగురు వస్తారు. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీలత శ్రీవల్లి డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత సీతాకాంత్ తన మేనేజర్ కి చెప్పి వాళ్ళని పిలిపించిన విషయం గుర్తుకుచేసుకుంటాడు.మిమ్మల్ని పిలువలేదు కదా.. మీరు ఎలా వచ్చారని రామలక్ష్మి వాళ్ళని అడుగుతుంది. మేం ఇదే కాలనీలో ఉంటున్నాం.. సీతాకాంత్ భార్య పూజ చేసుకుంటుందని తెలిసి వచ్చామని వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత రామలక్ష్మి పూజ చేసుకొని వాయినం ఇచ్చి పంపిస్తుంది.
ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళు ఎలా వచ్చారని ఆలోచిస్తుంటే.. అందులో ఆలోచించండానికి ఏముంది సీతాకాంత్ రప్పించాడని తన మాటల్లోనే అర్థమవుతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వచ్చి నా చుట్టూ దుష్టశక్తలు ఉన్నాయని స్వామి చెప్పింది నిజమే.. ఈ పూజ ఆపాలని చాలా ట్రై చేశారు కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందంటూ ఇండైరెక్ట్ గా శ్రీలత శ్రీవల్లిలకి వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి.ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ గదిలో ఉండగా వచ్చి.. చాలా థాంక్స్ దేవుడా వాళ్ళని టైమ్ కి పంపించారని రామలక్ష్మి అంటుంటే.. అయ్యో అన్నిసార్లు ఎందుకు పర్లేదని సీతాకాంత్ అంటాడు. మీరు ఎందుకు అలా అంటున్నారు. మీరే పంపించారా అని రామలక్ష్మి అడుగుతుంది. అదేం లేదని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం శ్రీలత, సందీప్ లు ఏదో మాట్లాడుకుంటుంటే.. ఏం మాట్లాడుకుంటున్నారని రామలక్ష్మి వచ్చి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |